News April 12, 2025
అల్లూరి: నేడే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అల్లూరి జిల్లాలో ఫస్టియర్ 8,063 మంది, సెకండియర్ 6,657 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు రిజల్ట్స్ కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరిగేవారు. నేడు సెల్‌ఫోన్‌లోనే చూసుకుంటున్నారు. రిజల్ట్స్ వెతికేందుకు టెన్షన్ పడొద్దు.. వే2న్యూస్ యాప్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
Similar News
News December 6, 2025
కాకినాడ టీడీపీలో ఏం జరుగుతోంది..?

కాకినాడ టీడీపీలో ఏం జరుగుతోందని క్యాడర్ ఆందోళన చెందుతోంది. సిటీ ఎమ్మెల్యే కొండబాబు హవాకు సొంత కూటమిలోనే బ్రేకులు పడుతున్నాయని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తాజాగా కమిషనర్ నియామకంలో ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వర్మను కాదని ఎంపీ సానా సతీశ్, ఎమ్మెల్సీ పద్మశ్రీ చక్రం తిప్పి సత్యనారాయణను తేవడం హాట్ టాపిక్ అయ్యింది. ఎంపీ వర్గం పైచేయి సాధించడంతో.. ఎమ్మెల్యే పరిస్థితి ఏంటని క్యాడర్ గుసగుసలాడుకుంటోంది.
News December 6, 2025
గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

AP: విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న కృషిని CM వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
News December 6, 2025
మంచిర్యాల: ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి: కలెక్టర్

ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి సేవలను పొందడం ప్రతి పౌరుడి హక్కు అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మధుతో కలిసి ఆయన గోడప్రతులను ఆవిష్కరించారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.


