News February 17, 2025
అల్లూరి: నేడే ప్రారంభం

అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ కొయ్యూరు మండలంలో పర్యటించనున్నారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కలెక్టర్ పర్యటనలో భాగంగా ముందుగా ఆయన లంకవీధి గ్రామానికి చేరుకుంటారు. అనంతరం అల్లూరి సీతారామరాజు అనుచరులైన గాము గంటన్నదొర, మల్లుదొరల కుటుంబ సభ్యుల కోసం నిర్మించిన పక్కా గృహాలను ప్రారంభించనున్నారు.
Similar News
News September 18, 2025
ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. 2025-26లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 260 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా నిలువ చేయాలన్నారు.
News September 18, 2025
వేగూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

కోవూరు మండలం వేగూరు పంచాయతీలో పిడుగుపాటుకు గోళ్ల వెంకయ్య మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మృతదేహాన్ని పరిశీలించారు.
News September 18, 2025
OCT 1 నుంచి అమల్లోకి ఆన్లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం

ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించిన కొత్త <<17486290>>రూల్స్<<>> అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే గేమింగ్ కంపెనీలు, స్టేక్ హోల్డర్స్‌తో పలుమార్లు చర్చలు జరిపామన్నారు. రూల్స్ అమల్లోకి వచ్చే ముందు గేమింగ్ ఇండస్ట్రీతో మరోసారి చర్చిస్తామన్నారు. ఆన్లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించేందుకు కేంద్రం ఇటీవల ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.