News April 2, 2025

అల్లూరి: పాలీసెట్ పరీక్షకు ఉచిత శిక్షణ

image

రాష్ట్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశ పాలీసెట్-2025 పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అల్లూరి జిల్లా పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.సుజాత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి పాలీసెట్ కోచింగ్‌కు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News December 1, 2025

13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

IBPS రీజినల్ రూరల్ బ్యాంక్‌లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://www.ibps.in/

News December 1, 2025

మేడారం పనుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి: CM

image

TG: మేడారం అభివృద్ధి పనులు నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘అభివృద్ధి పనుల్లో ఆచార‌ సంప్ర‌దాయాలు, నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి. పొర‌పాట్లు దొర్లితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. రాతి ప‌నులు, ర‌హ‌దారులు, గ‌ద్దెల చుట్టూ రాక‌పోక‌ల‌కు మార్గాలు, భ‌క్తులు వేచి చూసే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి అంశంపై CM అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.

News December 1, 2025

సజ్జ రైతులకు దక్కని మద్దతు ధర

image

AP: సజ్జలను పండించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అక్టోబరులో మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట నాణ్యత, దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775గా ఉంటే.. నాణ్యత సరిగా లేదని రూ.1800 కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జలను సాగు చేశారు.