News March 2, 2025
అల్లూరి: పెరిగిన చికెన్ ధరలు..కేజీ రూ.200

అల్లూరి జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం నాటికి లైవ్ చికెన్ కేజీ రూ.90 ఉండగా, స్కిన్ రూ.180, స్కిన్ లెస్ రూ.200గా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనుగోలుపై మాంసాహార ప్రియులు ఆసక్తి కనబరచడంతో చికెన్ ధరలు తగ్గాయి. తాజాగా మూడు రోజుల వ్యవధిలో చికెన్ ధర సుమారు రూ.20 పెరగడంతో ఆదివారం నాటికి కొయ్యూరులో కిలో చికెన్ రూ.200(స్కిన్ లెస్) అమ్మకాలు చేపట్టారు.
Similar News
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్ – రైతులకు సూచనలు

‘సెన్యార్’ తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం మంచిది. ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచితే వర్షానికి తడవకుండా ఉంటుంది.
News November 21, 2025
నిజాంసాగర్: నవోదయ 6వ తరగతి అడ్మిట్ కార్డులు విడుదల

నిజాంసాగర్ జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల అయినట్లు ప్రిన్సిపల్ సీతారామ్ శుక్రవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష DEC 13న నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
News November 21, 2025
ఎన్కౌంటర్లపై మావోయిస్టుల లేఖ

వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథలు అల్లారని ఆరోపించింది. చికిత్స కోసం వచ్చిన <<18318593>>HIDMA<<>>ను ఎన్కౌంటర్ చేశారని మండిపడింది. నిరాయుధులుగా ఉన్నవారిని హత్య చేశారంది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.


