News February 18, 2025

అల్లూరి: యాక్సిడెంట్‌లో యువకుడి మృతి

image

జీ.మాడుగుల-మద్దిగరువు ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయలపాలైనా కర్రి శ్రీను సోమవారం మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం ప్రమాదం జరిగిన అనంతరం పోలీసు శాఖ చొరవ తీసుకొని పాడేరు తరలించారు. సోమవారం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు పెందుర్తి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Similar News

News February 24, 2026

హనుమకొండ హసన్‌పర్తిలో మర్డర్..!

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో సోమవారం రాత్రి మర్డర్ జరిగింది. గ్రామానికి చెందిన బాల్నే మొగిలి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి కత్తులు, గొడ్డలితో వచ్చి మొగిలిని దారుణంగా పొడిచి చంపినట్లు తెలుస్తోంది. హత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News February 24, 2026

అనంతపురంలో పారిశ్రామికాభివృద్ధికి ఏపీఐఐసీ ముందడుగు

image

అనంతపురం జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం మూడు MSME పార్కులను అభివృద్ధి చేసినట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగ కుమార్ తెలిపారు. కూడేరు, తిమ్మసముద్రం, ఉరిచింతల గ్రామాల పరిధిలో 293 పారిశ్రామిక ప్లాట్లు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 24, 2026

MLG: ఇంటర్ విద్యార్థులూ.. ఇవి తప్పక తెలుసుకోండి..!

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా అధికారి వీరేందర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ వాచ్, సెల్‌ఫోన్లు, కెమెరాలు ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకురావద్దన్నారు. కాగా పరీక్షా కేంద్రానికి సుమారు 200 మీటర్ల వరకు ఎలాంటి జిరాక్స్ షాపులు కూడా తెరిచి ఉంచవద్దన్నారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు.