News February 25, 2025

అల్లూరి: రెండు రోజులు లిక్కర్ షాపులు బంద్

image

అల్లూరి జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులు మద్యం దుకాణాలు మంగళవారం సాయంత్రం నుంచి మూసి వేయించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి 48 గంటలపాటు లిక్కర్ షాపులు మూసివేయాలని దుకాణదారులను అధికారులు ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎటువంటి మద్యం దుకాణాలు నిర్వహించరాదని హెచ్చరించారు.

Similar News

News February 26, 2025

KMR:18,469 మంది విద్యార్థులు.. 38 సెంటర్లు..

image

ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న వేళ.. అధికారులు సర్వం సిద్ధం చేసే పనిలో ఉన్నారు. KMR జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం 18,469 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం 38 పరీక్ష కేంద్రాలను, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, 6 గురు సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం తెలిపారు.

News February 26, 2025

అహ్మదాబాద్ తరహాలో అమరావతిలో స్టేడియం: లోకేశ్

image

AP: అహ్మదాబాద్‌ మాదిరి అమరావతిలోనూ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంగీకారం తెలిపిందని చెప్పారు. ఇటీవల భారత్-పాక్ మ్యాచ్ కోసం తాను దుబాయ్ వెళ్లానని, ఆ సమయంలో మన జట్టుకు సపోర్ట్ చేయడంతో పాటు స్టేడియం నిర్మాణం, సీటింగ్ తదితరాలను పరిశీలించి జైషాతో మాట్లాడానన్నారు. దీనిపై కూడా YCP వాళ్లు తనను ట్రోల్ చేశారని వివరించారు.

News February 26, 2025

అనకాపల్లి జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు

image

ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అనకాపల్లి జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ తెలిపారు. పోలింగ్ మెటీరియల్ కోసం ఎన్నికల అధికారులు సిబ్బంది 26న అనకాపల్లి జీవీఎంసీ మెయిన్ హైస్కూల్ లో హాజరు కావాలన్నారు. 10 బస్సులు ద్వారా పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తారని అన్నారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుందన్నారు.

error: Content is protected !!