News April 7, 2025
అల్లూరి: రెట్టింపైన మిరియాలు ధర

అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విరివిగా పండిస్తున్న మిరియాల రేటు గణనీయంగా పెరిగింది. గతేడాది కిలో రూ.350 పలుకగా నేడు రూ.600కి రైతుల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పెదబయలు, ముంచింగిపుట్టు తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. అధిక ధర లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 24, 2025
పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.
News November 24, 2025
MNCL: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

2025- 26 సంవత్సరానికి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ రూ.100, హయ్యర్ రూ.150, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ రూ.150, హయ్యర్ రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 5 వరకు, అపరాధ రుసుం రూ.50తో 12వ తేదీ, రూ.75తో 19వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని సూచించారు.
News November 24, 2025
నెల్లూరు విద్యార్థులకు ఎవరెస్ట్ ఎక్కే ఛాన్స్.!

జిల్లాలోని 52 మంది దివ్యాంగ విద్యార్థులకు అపురూప సాహస యాత్ర అవకాశం దక్కింది. సమగ్రశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అడ్వెంచర్ స్పోర్ట్స్’కార్యక్రమానికి విద్యార్థులు ఎంపికయ్యారు. PMశ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపితే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికవుతారు. ముందుగా వారు జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలి. అందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.


