News February 24, 2025
అల్లూరి: రేపటి నుంచి వైన్ షాపులు క్లోజ్

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అల్లూరి జిల్లాలో వైన్ షాపుల మీద ఆంక్షలు విధించారు. ఈ నెల 25సాయంత్రం 5 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సుధీర్ ఆదేశించారు. పాడేరు డివిజన్‌లో 22, రంపచోడవరంలో 10, చింతూరులో 8 దుకాణాలకు తమ సిబ్బంది సీలు వేస్తారని చెప్పారు. బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవన్నారు.
Similar News
News March 26, 2025
నెల్లూరు జిల్లాలోని HM, టీచర్లకు గమనిక

నెల్లూరు జిల్లాలోని ZP ప్రభుత్వ మున్సిపాలిటీ, మండల పరిషత్ పాఠశాలలలో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 28వ తేదీలోగా తెలియజేయాలని డీఈఓ డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్‌సైట్, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉందన్నారు.
News March 26, 2025
పల్నాడు: మంత్రి పదవి రేసులో యరపతినేని.?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావుకు ప్రాతినిధ్యం కల్పించాలని TDP కార్యకర్తలు బలంగా వాదన వినిపిస్తున్నారు. MLC నాగబాబుకు మంత్రి మండలిలో చోటు కల్పించేందుకు విస్తరణ చేపట్టనున్నారు. క్యాబినెట్‌లో పల్నాడుకు ప్రాతినిధ్యం లేదు. గురజాల నుంచి వరుసగా 7 సార్లు పోటీ చేసి TDPలో 3 తరాలతో పనిచేసిన యరపతినేనికి మంత్రి మండలిలో బెర్త్‌పై ప్రచారం జరుగుతోంది.
News March 26, 2025
మంగళగిరి: అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్

అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీసు స్టేషన్‌లో శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. అఘోరితో కలిసివచ్చి శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు, కేర్‌టేకర్ విష్ణుతో ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఇష్ట పూర్వకంగానే అఘోరిగా మారినట్లు శ్రీవర్షిణి తెలిపింది.