News April 11, 2025
అల్లూరి: రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అల్లూరి జిల్లాలో ఫస్టియర్ 8,063 మంది, సెకండియర్ 6,657 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News July 11, 2025
జగిత్యాల మెడికల్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. షర్మిల

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల కొత్త ప్రిన్సిపాల్‌గా డాక్టర్ జి. షర్మిల గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌లోని క్యాతం చందయ్య మెమోరియల్ మెటర్నిటీ ఆసుపత్రిలో గైనకాలజీ ప్రొఫెసర్‌గా, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను పదోన్నతిపై జగిత్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం కళాశాలకు వచ్చిన ఆమెకు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
News July 11, 2025
చనిపోయినట్లు ప్రకటించిన 12 గంటలకు లేచిన శిశువు!

మహారాష్ట్రలో ఓ వింత సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. బీద్‌లోని రామానంద తీర్థ్ ఆస్పత్రిలో ఓ మహిళ 7వ నెలలోనే 900 గ్రాములున్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ బేబీని రాత్రంతా ICUలో ఉంచి ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఖననం చేసే సమయంలో ముసుగు తీసి చూడగా కదలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News July 11, 2025
రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే: లారా

ఈసారి <<16983109>>క్వాడ్రాపుల్ సెంచరీ<<>>కి అవకాశమొస్తే బాదేయాలని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా చెప్పినట్లు సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ తెలిపారు. ‘నీ సొంత లెగసీ సృష్టించుకోవాలి. రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే. మళ్లీ 400 కొట్టే ఛాన్స్ వస్తే వదులుకోకు’ అని లారా చెప్పినట్లు ముల్డర్ తెలిపారు. కాగా లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించారు.