News April 28, 2024

అల్లూరి: విషాదం.. కూతురి ఇంటికొచ్చి తండ్రి దుర్మరణం

image

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గడుగుపల్లి వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. శనివారం రాత్రి గడుగుపల్లిలోని కుమార్తె ఇంటికి వచ్చిన వృద్ధుడిని జాతీయ రహదారిపై బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 21, 2025

విశాఖ 572 మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు

image

విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు మంజూరు కానున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 572 మందికి వివిధ కేటగిరీల్లో ప్రమోషన్లు సిద్ధం చేసినట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు 27, మెకానికల్ సూపర్వైజర్లు 113, ఏడీసీలు 115, కండక్టర్లు గ్రేడ్-1 130, డ్రైవర్లు గ్రేడ్-1 167 మంది ఉన్నారు.

News October 20, 2025

విశాఖలో జరిగే సీఐఐ సదస్సులో పాల్గొనండి: నారా లోకేష్

image

ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో న్యూసౌత్ వేల్స్ పార్లమెంట్ ఆవరణలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల సాధించిన పెట్టుబడులను వివరించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌లో పాల్గొనవలసిందిగా కోరారు.

News October 20, 2025

విశాఖలో అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె

image

వాల్తేరు డిపోలో అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె ఆదివారం కూడా కొనసాగింది. ఈ మేరకు డిపోకు చెందిన 29 బస్సులు నిలిచిపోయాయి. కార్యదర్శి బి.జంపన్న మాట్లాడుతూ.. రూ.26,000కి జీతం పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. నైట్ హాల్ట్ అలవెన్సులు, దసరా బోనస్, రెండు జతల బట్టలు ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.18వేల జీతంతో జీవనం కష్టంగా ఉందని వాపోయారు. జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.