News February 24, 2025
అల్లూరి: సిగ్నల్స్ రావడం లేదు..!

అల్లూరి జిల్లాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కష్టాలు వీడటం లేదు. మండల కేంద్రమైన రాజవొమ్మంగిలో సైతం సిగ్నల్స్ ఉండటం లేదు. నిన్నటి రోజున ఇక్కడ సిగ్నల్స్ నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. గత కొన్ని నెలలుగా ఈ సమస్య ఉందని వినియోగదారులు వాపోతున్నారు. డుండ్రిగుడ మండలంలోనూ సిగ్నల్స్ లేవని ఆరోపిస్తున్నారు. ఇంతకూ మీ ఏరియాలోనూ ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News November 21, 2025
భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే బదిలీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం హైదరాబాద్కు బదిలీ అయ్యారు. జిల్లాలో ఎస్పీ కిరణ్ ఖరే సుమారు రెండేళ్ల పాటు విధులు నిర్వహించారు. జిల్లాలో ఎక్కువ కాలం ఎస్పీగా విధులు నిర్వహించిన ఆయన సేవలను పలువురు పోలీస్ అధికారులు కొనియాడారు. జిల్లాకు నూతన ఎస్పీగా గవర్నర్ జిష్ణుదేవ్ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న సిరిశెట్టి సంకీర్త్ కుమార్ నియామకమయ్యారు.
News November 21, 2025
ఫిష్ ఫార్మింగ్కు సహకారం అందిస్తాం: కలెక్టర్

ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మింగ్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఫిష్ ఫార్మింగ్ రైతులకు హామీ ఇచ్చారు. ఐ.పోలవరం మండలంలోని పెదమడి వద్ద ఆర్నమెంటల్ చేపల పెంపకం కేంద్రాన్ని ఆయన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుతో కలిసి పరిశీలించారు. ఎక్వేరియంలో రంగురంగుల ఆర్నమెంటల్ చేపల పెంపకం ద్వారా 22 రకాల జాతుల చేపలను పెంచుతున్నట్లు రైతు వర్మ వారికి వివరించారు.
News November 21, 2025
జాతీయ అథ్లెటిక్ పోటీలకు ‘పుల్లేటికుర్రు’ విద్యార్థిని

జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు జడ్పీహెచ్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని చీకురుమిల్లి హర్షవర్ధని ఎంపికైనట్లు ఇన్ఛార్జ్ HM ధర్మరాజు శుక్రవారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 రన్నింగ్ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో హర్షవర్ధని 1500 మీటర్ల రన్నింగ్లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని చెప్పారు.


