News March 21, 2025
అల్లూరి: ‘సెల్ టవర్లకు త్వరితగతిన కనెక్షన్లు ఏర్పాటు చేయండి’

అల్లూరి జిల్లాలో సెల్ సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని, నిర్మాణాలు పూర్తయిన సెల్ టవర్లకు ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ నెట్వర్క్ సంస్థలతో సమావేశం నిర్వహించారు. సెల్ టవర్ల కోసం అనేక గ్రామాల నుంచి దరఖాస్తులు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా మంజూరైన సెల్ టవర్లను పనిచేసే స్థితికి తీసుకు రావాలని ఆదేశించారు.
Similar News
News December 10, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✒ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి Dy కలెక్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
✒ గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.2,123కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు
✒ రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది DEOలు ట్రాన్స్‌ఫర్
✒ అమరావతికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ఈ-లాటరీ
✒ తిరుమల కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్, ఏ29 సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న సీబీఐ-సిట్ అధికారులు
News December 10, 2025
సీడ్ యాక్సిస్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు కేటాయింపు

రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం నిమిత్తం AP సీదాకు భూములను ఇచ్చిన ఉండవల్లి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాయపూడిలోని CRDA కార్యాలయంలో ఈ – లాటరీ జరుగుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ – లాటరీలో భాగంగా 14 మంది రైతులకు 22 ప్లాట్లను ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా కేటాయించడం జరుగుతుందన్నారు. వీటిలో 14 రెసిడెన్షియల్ ప్లాట్లు, 8 కమర్షియల్ అన్నారు.
News December 10, 2025
పార్వతీపురం రైతులకు సబ్ కలెక్టర్ సూచన

రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. మంగళవారం ఆయన వీరఘట్టం మండలంలోని తిధిమి గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడి మిల్లర్లకు అదనంగా ధాన్యం ఇవ్వద్దని సూచించారు. ఎవరైనా అదనంగా ధాన్యం అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు .అనంతరం గ్రామంలో ఉన్న రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు.


