News January 29, 2025

అల్లూరి: స్కూళ్లలో కరాటే శిక్షకుల నియామకం

image

అల్లూరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో కరాటే శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సర్వశిక్షాభియాన్ ఏపీసీ స్వామినాయుడు బుధవారం తెలిపారు. రాణీ లక్ష్మీబాయి ఆత్మ పరిరక్షణ పథకం కింద 3 సంవత్సరాల అనుభవం కలిగిన కరాటే శిక్షకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఫిబ్రవరి 1తేదీలోగా తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 31వరకు పనిచేయాల్సి ఉంటుందన్నారు. 

Similar News

News October 24, 2025

బస్సు ప్రమాదంలో.. పటాన్‌చెరు వాసులు మృతి

image

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్‌చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.