News March 7, 2025

అల్లూరి: ‘హోమ్ స్టేలపై సమావేశం’

image

పర్యాటకుల గిరిజన ఆవాసాల్లో బసకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనను 15వ తేదీలోగా సమర్పించాలని యంత్రాంగానికి చెప్పారు. గురువారం కలెక్టరేట్‌‌లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్వయం సహాయ సంఘాలు, గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో హోమ్ స్టేలు ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. హోమ్ స్టేలతో గిరిజనులు ఆర్థికంగా లబ్ధి పొందుతారన్నారు.

Similar News

News October 19, 2025

HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

image

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.

Alert: దీపావళికి స్వీట్లు కొంటున్నారా?

image

TG: దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు కొంటున్న వారికి అలర్ట్. రాష్ట్రంలోని పలు స్వీట్ షాపుల్లో సింథటిక్ కలర్స్, ఫేక్ సిల్వర్ ఫాయిల్, రీయూజ్డ్ ఆయిల్, కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. కనీస పరిశుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో షాపుల్లో క్వాలిటీని చూసి స్వీట్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.