News March 24, 2025
అల్లూరి: 10th లెక్కల పరీక్షకు 104 మంది దూరం

అల్లూరి జిల్లాలో సోమవారం జరిగిన 10th లెక్కల పరీక్షకు మొత్తం 11665మంది హాజరు కావాల్సి ఉండగా 11561మంది హాజరయ్యారని, 104 మంది గైర్హాజరయ్యారని DEO. బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. అరకువాలీ, అనంతగిరి మండలాల్లో పలు పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి కాపీయింగ్ ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామని, జిల్లా అంతటా ప్రశాంతంగా పరీక్ష జరిగిందని తెలిపారు.
Similar News
News April 19, 2025
విజయవాడలో రోడ్డు ప్రమాదం (UPDATE)

విజయవాడ గన్నవరం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గన్నవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌కు ప్రసాదంపాడు వద్ద గుండెపోటు రావడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ఫుట్ పాత్‌పై లారీ దూసుకెళ్లడంతో నడుచుకొని వెళ్తున్న రామసాయి(18) స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పామర్రుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
News April 19, 2025
నేటి నుంచి GMAT స్పెషల్ క్లాసులు

TG: గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(GMAT) వచ్చే నెలలో జరగనుంది. పరీక్ష రాసే అభ్యర్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు నేటి నుంచి స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రోజూ ఉ.8-8.30 వరకు నిపుణ ఛానల్‌లో, సాయంత్రం 6-6.30 వరకు విద్య ఛానల్లో క్లాసులు ప్రసారం చేస్తామని వెల్లడించారు. APRIL 22న ‘వరల్డ్ ఎర్త్ డే’ సందర్భంగా ఉ.11కు ప్రత్యేక లైవ్ పోగ్రామ్ ఉంటుందన్నారు.
News April 19, 2025
ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.