News April 22, 2025
అల్లూరి: ‘25.50 లక్షల బుక్స్ అవసరం’

పాఠశాల తెరిచిన వెంటనే విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు అందించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చెస్తుందని DEO బ్రాహ్మజిరావు మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 2,913 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిలో 1,69,175 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరికి 25.50 లక్షల బుక్స్ అవసరం అని తెలిపారు. ఈ నివేదిక ప్రభుత్వానికి పంపామని చెప్పారు.
Similar News
News April 23, 2025
గజ్వేల్: ఎంపికైన ఆర్మీ జవాన్‌కు సన్మానం

గజ్వేల్ ఉచిత కోచింగ్ ద్వారా ఆర్మీకి ఎంపికైన వరుణ్‌ను గజ్వేల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పురుషోత్తం రెడ్డి మంగళవారం రాత్రి సన్మానం చేశారు. ఏసీపీ మాట్లాడుతూ.. గజ్వేల్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆర్మీ రంగంలోకి యువతని ప్రోత్సహించి ఆర్మీలో చేరేలా చూడాలని ఉచిత కోచింగ్ అందిస్తున్న నీల చంద్రంకు సూచించారు.
News April 23, 2025
అనంత: రైలు చైన్ లాగారంటే.. మెడలో చైన్ ఊడినట్లే.!

సురక్షిత ప్రయాణాలు చేయాలనుకునే వారు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అలాంటిది రైలు ప్రయాణాలంటే బయపడాల్సిన పరిస్థితి వచ్చింది. రైలు నిర్మానుష్య ప్రాంతంలో ఆగిందంటే మహిళల మెడల్లో చైన్ చోరీ జరిగినట్లే. ఇటీవల గుంతకల్లు- తిరుపతి రూట్ ఔటర్‌లో నిలిచిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ 2 వరుస చోరీలు జరిగాయి. అధికారులు ఇలాంటి చర్యలపై నిఘా పెట్టాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు.
News April 23, 2025
టెర్రర్ అటాక్.. ప్రధాని మోదీ కీలక సమావేశం

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన టెర్రర్ అటాక్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.