News April 5, 2025
అల్వాల్: TIMS ఆసుపత్రికి అనుబంధంగా కాలేజీలు!

అల్వాల్లో నిర్మిస్తున్న TIMS ఆసుపత్రిని గ్యాస్ట్రో సంబంధ వ్యాధుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తున్నారు. దీనికి కుత్బుల్లాపూర్ మెడికల్, నర్సింగ్ కాలేజీలను అనుసంధానం చేయనున్నారు. అంతేకాక డాక్టర్లు, నర్సుల కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పీజీ కాలేజీ విద్యార్థులు కూడా అక్కడ వైద్యం అందించే అవకాశం ఉంటుంది.
Similar News
News April 9, 2025
నేడే పేట జిల్లా బీజేపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కె. సత్య యాదవ్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రానున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు మెట్రో గార్డెన్‌లో ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
News April 9, 2025
ఏప్రిల్ 9: చరిత్రలో ఈరోజు

1860: మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది
1893: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ జననం(కుడి ఫొటో)
1930: నటుడు మన్నవ బాలయ్య జననం(ఎడమ ఫొటో)
1948: హిందీ నటి జయా బచ్చన్ జననం
1989: గాయకుడు, సంగీత దర్శకుడు ఏ.ఎం.రాజా మరణం
1994: స్వాతంత్య్ర సమరయోధుడు చండ్ర రాజేశ్వరరావు మరణం
2022: నటుడు మన్నవ బాలయ్య మరణం
News April 9, 2025
ఈరోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 9, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.31 గంటలకు
ఇష: రాత్రి 7.44 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.