News December 12, 2024

అవంతి శ్రీనివా‌స్‌పై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు 

image

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై బుద్ధా వెంకన్న Xలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ పాలనలో నువ్వు, జగన్ సర్వం నాకేశారని, నీకు రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకే ద్రోహం చేశావు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి నిన్ను తీసుకువెళ్లిన చంద్రబాబును అవమానించిన నీ సానుభూతి కూటమి పాలనకు అవసరం లేదు’ అని పోస్ట్ చేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్, ఊసరవెల్లి ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేశారు.

Similar News

News January 21, 2025

వీరులపాడు: బైక్ అదుపు తప్పి యువకుడు మృతి

image

వీరులపాడు మండల పరిధిలోని వెల్లంకి గ్రామంలో సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన కంచె సంతోష్ మెహతాగా గుర్తించారు. తమకు అండగా ఆసరాగా ఉంటాడనే కొడుకు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 21, 2025

పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి

image

పమిడిముక్కలలో నిన్న జరిగిన ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24)లు మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతిల విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

News January 21, 2025

విచారణ కమిటీ ముందు హాజరైన కొలికపూడి

image

తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్ సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలని కమిటీ హెచ్చరించినట్లు తెలస్తుంది. పార్టీకి చెడ్డపేరు వస్తుందని, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కాగా విచారణ నివేదికను కమిటీ అధిష్ఠానానికి పంపనుంది.