News December 5, 2024

అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

image

ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి తహశీల్దార్‌లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఇతర రెవెన్యూ సిబ్బందితో ధాన్యం సేకరణ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

Similar News

News October 16, 2025

కృష్ణా: బెల్ట్ షాపుల్లో మద్యం సురక్షితమేనా.?

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష యాప్‌ ద్వారా వైన్ షాపులు, బార్‌లలో మద్యం సీసాల స్కానింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే, బెల్ట్ షాపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని మద్యం ప్రియులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం మద్యం విక్రయిస్తున్న ఈ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్న సీసాలు అసలువో, నకిలీవో తెలుసుకునే అవకాశం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 16, 2025

అంగలూరులో రాష్ట్రంలో మొట్టమొదటి బాలికల పాఠశాల

image

గుడ్లవల్లేరు అంగలూరు గ్రామంలో చల్లపల్లి జమిందార్ జ్ఞాపకార్థంగా బాలికల పాఠశాల ప్రారంభించారు. స్వాతంత్య్రం రాక ముందు బాలికలకు విద్య దూరంగా ఉండేది. దీంతో 1946లో ఈ స్కూల్ ప్రారంభించి బాలికా విద్యకు పునాది వేశారు. జమిందారీ దాతృత్వంతో 96 సంవత్సరాల అద్భుత ప్రయణం సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన బాలికల ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఇటీవల జిల్లాస్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డు అందుకుంది.

News October 16, 2025

గన్నవరంలో యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

image

గన్నవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపులపాడు మండలానికి చెందిన గరికిపాటి సుబ్బారావుగా గుర్తించారు. అతను రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. మార్కెట్ నుంచి సరుకులకు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.