News February 6, 2025
అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ: అనకాపల్లి ఎస్పీ

ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రహదారి ప్రమాదాలను నియంత్రించవచ్చునని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. రహదారి భద్రత మాసోత్సవాలు జిల్లాలో ఈ నెల 16 వరకు జరుగుతాయన్నారు. పలుచోట్ల రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దన్నారు.
Similar News
News November 20, 2025
నేడే ఫెస్ట్.. HYD వస్తున్న ఉత్తర, తూర్పు భారత ప్రజలు

ఉత్తర, తూర్పు భారతదేశ నలు మూలల నుంచి గౌరవనీయ ప్రతినిధులు తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో, కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు HYD చేరుకుంటున్నారు. రాజ్‌భవన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ విశిష్టోత్సవం నేడు ప్రారంభం కానుంది. సాంకేతికతతో పాటు సంస్కృతిని కలగలిపే ఈ వేడుకలో తాజా అప్డేట్స్ కోసం వేచి ఉండండి.
News November 20, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు అధికారుల వెల్లడించారు. బీబీపేట్ 8.9°C, గాంధారి 9.9, మేనూరు, లచ్చపేట, నస్రుల్లాబాద్ 10, రామారెడ్డి, రామలక్ష్మణపల్లి, డోంగ్లి 10.1, జుక్కల్, బొమ్మన్ దేవిపల్లి 10.2, సర్వాపూర్ 10.3, నాగిరెడ్డిపేట, బిచ్కుంద, బీర్కూర్ 10.5, లింగంపేట 10.8°C నమోదైంది.
News November 20, 2025
ఫస్ట్ వింగ్‌కమాండర్ డా.విజయలక్ష్మి రమణన్

భారత వైమానిక దళ మొదటి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్. 1924లో జన్మించిన ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుని చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో సేవలందించారు. 1955లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరి గైనకాలజిస్ట్‌గా, తొలి మహిళా అధికారిణిగా నియమితులయ్యారు. 1962, 1966, 1971 యుద్ధాల్లో గాయపడిన సైనికులకు ఆమె చికిత్స అందించారు. 1977లో విశిష్ట సేవా అవార్డును అందుకున్న ఆమె 1979లో పదవీ విరమణ చేశారు.


