News October 29, 2024
అవగాహనతో సామాజిక, ఆర్థిక సర్వే చేయండి: కలెక్టర్
సామాజిక, ఆర్థిక సర్వే ద్వారా వివిధ వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదులు చేసేందుకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆర్థిక సర్వే, ప్రజాభిప్రాయ సేకరణ తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. తూఫ్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2024
సిద్దిపేట: శతాబ్దాల చరిత్ర గల ఆలయం.. అభివృద్ధి చేస్తే మేలు
అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని గాజులపల్లి, వీరారెడ్డిపల్లి, జంగాపల్లి శివారులో దాదాపుగా వెయ్యి ఎకరాలను మించిన రాతిబండపై వెలిసిన బండ మల్లన్న ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి సంక్రాంతి రోజున ఎడ్ల బండ్లు కట్టి మల్లన్న ఆలయం చుట్టు భక్తులు ప్రదక్షిణలు చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన గుడిని ప్రభుత్వం ఆర్థిక వనరులతో అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షిస్తున్నారు.
News November 12, 2024
వయా జహీరాబాద్.. ముంబై- HYD బుల్లెట్ ట్రైన్
ముంబై- హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైల్వే ప్రాజెక్ట్ కోసం డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేసి రైల్వే మంత్రిత్వశాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును 2051 వరకు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కొత్త లైన్ నిర్మాణానికి అధికారులు పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.
News November 12, 2024
లగచర్లలో ప్రభుత్వ తీరు అమానుషం: హరీశ్ రావు
వికారాబాద్ జిల్లా <<14585618>>లగచర్ల<<>>లో 300 మంది పోలీసులు మోహరించి స్థానికులను అరెస్టు చేయడం దారుణమని సిద్దిపేట MLA హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఫార్మా భూసేకరణకు నిరాకరించిన గ్రామస్థులపై అర్ధరాత్రి పోలీసులతో దమనకాండ సరికాదు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం తెలియాలి. వెంటనే ఈ భూసేకరణ ఆపాలి. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి’ అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.