News October 5, 2024
అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి: జేసీ
ప్రధాన మంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం అమలపై అవగాహన కార్యక్రమం వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో టీబీ నియంత్రణకు చేపట్టే కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
Similar News
News November 11, 2024
అనంతపురం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం వినిపిస్తారా?
నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం కావడంతో ప్రజల్లోనూ, నాయకుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు గ్రామ సమస్యలు, యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు గుమ్మరించారు. మరి వాటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో గళం వినిపిస్తారా, లేదా? మీరేమంటారు?
News November 11, 2024
తాడిపత్రిలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్
తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం ఐదో రోడ్డులో ఆదివారం రాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. కొందరి యువకులు గంజాయి సేవించి కేకలు వేస్తూ బైకులపై తిరుగుతూ హల్‌చల్ చేశారు. ప్రశ్నించిన కాలనీవాసులపై దాడికి తెగబడ్డారు. ఒక బైక్‌ను ధ్వంసం చేశారు. కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కృష్ణాపురం కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు.
News November 10, 2024
‘మచిలీపట్నం-ధర్మవరం రైలు బెంగళూరు వరకు పొడిగించండి’
నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం రైలును బెంగళూరు వరకు పొడిగించాలని సౌత్ వెస్ట్రన్ రైల్వేను దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఈ రైలు ధర్మవరం చేరుకున్న తర్వాత 7.40 గంటల పాటు ట్రాక్‌పై ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ రైలును బెంగళూరు వరకు పొడిగించాలని అభ్యర్థించింది. SWR అంగీకారంతో ఇది సాకారం కానుంది.