News October 8, 2024
అవనిగడ్డలో జాబ్ మేళా.. రూ.18వేల వరకు వేతనం

అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18- 29 ఏళ్లలోపువారు హాజరు అవ్వొచ్చన్నారు. ఇందులో పలు ప్రముఖ కంపెనీలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఎంపికైన వారికి రూ.10- 18 వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారని విక్టర్ బాబు చెప్పారు.
Similar News
News February 27, 2026
బాపులపాడు డిప్యూటీ ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాపులపాడు మండల డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. లక్ష్మయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను వసూళ్లలో పురోగతి సాధించకపోవడం, సమీక్షా సమావేశాలకు గైర్హాజరు అవుతుండటం, OHSR ట్యాంక్‌లను పరిశుభ్రపర్చడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓను సస్పెండ్ చేశారు.
News February 26, 2026
నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షల ఏర్పాట్లపై న్యూఢిల్లీ నుంచి NTA డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖని, రాష్ట్ర విద్యా కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు, భద్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
News February 26, 2026
అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.


