News April 7, 2025
అవనిగడ్డ: పండుగ రోజు విషాదం.. ముగ్గురి మృతి

శ్రీరామ నవమి పండుగ రోజు మోదుమూడిలో ఆనందం కన్నీటిగా మారింది. రాములోరి ఊరేగింపులో భాగంగా కృష్ణా నదిలో రామ స్తూపాన్ని శుద్ధిచేస్తుండగా ముగ్గురు బాలురు నీటమునిగి మృతిచెందిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడం, ఒకే కుటుంబానికి వారసులుగా ఉండటం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. వీరబాబు, వెంకట గోపి కిరణ్, వర్ధన్లు మృతిచెందిన వారిలో ఉన్నారు.
Similar News
News April 8, 2025
జి. కొండూరులో గోడ కూలి ఒకరి మృతి

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జి. కొండూరు (M) పినపాకలో సోమవారం దారుణం జరిగింది. మంగారావు (46) ఇబ్రహీంపట్నం బస్సు డిపో కండక్టర్గా పని చేస్తున్నారు. సాయంత్రం వాకింగ్కి వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీగా ఈదురు గాలులతో వర్షం పడింది. దీంతో ఆయన గోడ పక్కకు వెళ్లగా గోడ కూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మైలవంరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News April 8, 2025
గన్నవరం: చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఆత్కూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మార్చి 31వ తేదీ రాత్రి ద్వారకా రాణి అనే మహిళ తన భర్తాతో కలిసి బైక్పై పొట్టిపాడు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి మెడలోని గొలుసు లాక్కొని పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 16 కాసుల బంగారాన్ని రెండు బైక్స్ను స్వాధీనం చేసుకున్నారు.
News April 8, 2025
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారెక చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. విశాఖపట్నం జిల్లా వ్యాట్ కోర్ట్ అప్పిలేట్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జి. గోపిని జిల్లా జడ్జిగా నియమించారు. రాష్ట్రంలో పలువురు జడ్జ్ లను బదిలీ చేయగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు విశాఖపట్నంకు, SC, ST కోర్టు జడ్జి చిన్నబాబు అనంతపురం జిల్లా పోక్సో కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.