News March 30, 2025

అవనిగడ్డ: బెట్టింగ్‌లో మరో నలుగురు అరెస్ట్ 

image

అవనిగడ్డ MPP కుమారుడు పవన్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం అతడితో పాటు పెడనకు చెందిన కోట నాగేశ్వరరావు, కృష్ణలంకకు చెందిన ఉమామహేశ్వరరావు, అవనిగడ్డకు చెందిన గోపయ్యస్వామి, వెంకటరమణ పటమట పోలీసులకు అప్పగించారు. వీరు మొత్తం రూ.48లక్షల లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కాఫీ షాపులు, కిల్లి కోట్లు కలెక్షన్ పాయింట్లుగా, వాహన నంబర్‌లతో డబ్బులు లావాదేవీలు చేశారు. 

Similar News

News April 22, 2025

కృష్ణా : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు – DRO

image

కృష్ణా జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు.10 పరీక్షా కేంద్రాల్లో 4546 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.

News April 22, 2025

కృష్ణా : ‘కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం తగదు’

image

కోర్టు కేసులకు సంబంధించి వకాలత్, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.

News April 21, 2025

కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

image

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.

error: Content is protected !!