News March 13, 2025
అవయవ దానానికి ముందుకు రావాలి: కలెక్టర్

బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్లో వాక్ థాన్ అన్ ఆర్గాన్ డొనేషన్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానంతో 8 మంది రోగులకు అవసరమైన అవయవాలు అమర్చవచ్చన్నారు. గత సంవత్సరం అవయవ దానం ద్వారా 210 మందికి అమర్చారని గుర్తు చేశారు.
Similar News
News December 20, 2025
విశాఖలో టెట్ పరీక్షకు 131 మంది గైర్హాజరు: డీఈవో

విశాఖలో శనివారం 17 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 2,018 మంది అభ్యర్థులకు గానూ 1,887 మంది అభ్యర్థులు హాజరుకాగా 131 మంది గైర్హాజరు అయ్యారని వెల్లడించారు. డీఈవో ప్రేమ్ కుమార్ రెండు పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్ ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో పేర్కొన్నారు.
News December 20, 2025
విశాఖ: ‘కాంగ్రెస్ అవినీతి విషవృక్షం’

కాంగ్రెస్ అవినీతి విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీ ప్రజలకు హ్యాట్సాఫ్ అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. బీచ్ రోడ్లో మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణలో పాల్గొని మాట్లాడారు. వైజాగ్ వస్తే బీపీ, షుగర్ ఎగిరిపోతాయన్నారు. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు అని, బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, MP, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు.
News December 20, 2025
మధురవాడలో తెల్లవారుజామున యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

మధురవాడలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమిలి మండలం పెద్దవీధికి చెందిన పూసర్ల లక్ష్మణరావు (79) అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణరావు వల్లినగర్లోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ జంక్షన్ సమీపంలో సర్వీస్ రోడ్డులో వెళుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


