News March 13, 2025

అవయవ దానానికి ముందుకు రావాలి: కలెక్టర్

image

బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్‌లో వాక్ థాన్ అన్ ఆర్గాన్ డొనేషన్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానంతో 8 మంది రోగులకు అవసరమైన అవయవాలు అమర్చవచ్చన్నారు. గత సంవత్సరం అవయవ దానం ద్వారా 210 మందికి అమర్చారని గుర్తు చేశారు.

Similar News

News March 28, 2025

విశాఖలో ఈనెల 30న ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

image

విశాఖలో మార్చి 30న జరిగే IPL మ్యాచ్‌ల నిర్వహణపై సీపీ శంఖబ్రత బాగ్చీ గురువారం సమీక్షించారు. మ్యాచ్ జరిగే రోజు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. మ్యాచ్‌ రోజు శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, NAD మీదుగా నగరంలోకి రావాలన్నారు. చిన్న వాహనాలు మారికవలస, మిథులాపురి కాలనీ, బీచ్ రోడ్డు, జోడిగుడ్లపాలెం మీదుగా నగరంలోకి వెళ్లాలని సూచించారు.

News March 27, 2025

నిత్యవసర వస్తువుల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై దృష్టి సారించాలి: జేసీ

image

మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల‌ను జేసీ మ‌యూర్ అశోక్ ఆదేశించారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా ధ‌ర‌ల నియంత్ర‌ణ క‌మిటీతో స‌మావేశం అయ్యారు. ప్ర‌స్తుతం పప్పులు, బియ్యం ధ‌ర‌లు అధికంగా ఉన్నాయ‌న్నారు. రైతు బ‌జార్లు, బ‌య‌ట మార్కెట్ల‌లో ధ‌ర‌ల‌ను ప‌రిశీలించాల‌న్నారు. మార్కెట్లో ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News March 27, 2025

విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

image

వరుస పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి చర్లపల్లికి స్పెషల్ (08579/80) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 28, ఏప్రిల్ 1 తేదీల్లో బయలుదేరి మరుసటి రోజు చర్లపల్లికి చేరుతాయి. మళ్లీ మార్చి 29, ఏప్రిల్ 2వ తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరి విశాఖ చేరుతాయని ప్రయాణికులు గమనించాలని కోరారు.

error: Content is protected !!