News July 14, 2024

అవసరమైతే రక్తం దానం చేస్తా: సిరిసిల్ల కలెక్టర్

image

సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అవసరమైతే తాను రక్తదానం చేస్తానని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా ఆస్పత్రిని శనివారం తనిఖీ చేసి బ్లడ్ బ్యాంకులోని రక్తం నిలువలపై ఆరా తీశారు. తనది ఓ నెగిటివ్ రక్తం అని, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైతే తన రక్తం అందజేస్తానని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News December 13, 2025

KNR: 567 మంది మహిళలు మాయం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో Jan 2024 నుంచి Oct 2025 వరకు 567 మంది మహిళలు, యువతుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇవేగాకుండా పోలీసుల దృష్టికి రానివి అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని కేసులు పోలీసులు చేదిస్తే చాలా కేసులు మిస్టరీగానే ఉండిపోతున్నాయి. అదృశ్యమైన వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారనేది అంతుచిక్కట్లేదు. కొందరు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

News December 13, 2025

KNR: స్వచ్ఛ హరిత రేటింగ్‌.. 8 పాఠశాలలు ఎంపిక

image

‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ రాష్ట్ర స్థాయి రేటింగ్‌కు కరీంనగర్ జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోనూ వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.