News January 30, 2025
అవార్డులు సాధించిన పత్తికొండ విద్యార్థులు

వికసిత్ భారత్ 2047 అనే అంశంపై SSGS (గుంతకల్) కళాశాలలో జరిగిన జాతీయ సదస్సులో పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని అవార్డులు సాధించారు. సాంకేతికతో నైపుణ్యాన్ని పెంపొందించుకొని పలు రంగాలలో విస్తృతంగా వినియోగించి స్థిరమైన అభివృద్ధి సాధ్యమని వ్యవసాయ సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పరిష్కరించాలని శివప్రసాద్, శ్రావణి, లత అన్నారు.
Similar News
News October 29, 2025
కర్నూలు జిల్లాలో పాఠశాలలకు సెలవు

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ రోజు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. స్టడీ క్లాసులు లేదా అదనపు తరగతులు నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇంటి వద్ద సురక్షితంగా ఉంచాలని సూచించారు.
News October 29, 2025
కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
News October 29, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్ విద్యార్థి

నవంబర్లో గుంటూరులో జరగబోయే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.షాకీర్ ఎంపికైనట్టు పాఠశాల హెడ్మాస్టర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సుదర్శన్ రావు, శేఖర్ మీడియాతో మాట్లాడారు. కర్నూలులో జరిగిన ఎంపిక పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి ఉద్యమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు తెలిపారు.


