News January 26, 2025

అవార్డు అందుకున్న అల్లూరి జిల్లా కలెక్టర్

image

అల్లూరి జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేశ్ కుమార్ బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ అందుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ చేతుల మీదుగా శనివారం ఈ అవార్డు తీసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలలో ఈ అవార్డును ప్రదానం చేశారు. గతేడాది ఓటర్ల జాబితా తయారీలో, సమ్మరీ రివిజన్‌లో విశేష కృషి చేసినందుకు కలెక్టర్‌కు ఈ అవార్డు వరించింది.

Similar News

News March 14, 2025

చింతలమానేపల్లి: వనదేవతలకు నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్ట్

image

డబ్బా గ్రామంలో కొన్ని రోజుల క్రితం సమ్మక్క సారలమ్మలకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన SI నరేశ్ విచారణ చేపట్టి అదే గ్రామానికి చెందిన మల్లేశ్ @ హరీశ్‌ను సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని సిర్పూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా అతడికి మతిస్థిమితం లేదని, ఎర్రగడ్డకు తరలించాల్సిందిగా తీర్పునిచ్చినట్లు వెల్లడించారు.

News March 14, 2025

ములుగు: సహజ రంగులను వినియోగించాలి: కలెక్టర్

image

ములుగు జిల్లా ప్రజలకు కలెక్టర్ దివాకర టీఎస్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరిని ఒక్కచోట చేర్చే హోళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను సహజ రంగులను వినియోగిస్తూ, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు. 

News March 14, 2025

జాతీయస్థాయి పోటీలకు మంచిర్యాల క్రీడాకారిణి

image

మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకట జనని జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రవి, శివమహేశ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. జననిని అసోసియేషన్ సభ్యులు, తదితరులు అభినందించారు.

error: Content is protected !!