News June 2, 2024

అవినాశ్ రెడ్డి హ్యాట్రిక్ విజయం ఖాయమేనా?

image

కడప పార్లమెంట్ ఫలితంపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఇప్పటికే అవినాశ్‌రెడ్డి రెండు సార్లు MPగా విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైగా ఓట్లతో విజయం సాధించగా, 2019లో ఏకంగా 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరోసారి విజయం సాధిస్తారని విశ్లేషకులు అంటుండగా, అందుకు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నాయి. మరి అవినాశ్ హ్యాట్రిక్ సాధిస్తారా లేక ఎగ్జిట్ పోల్స్‌ని కాదని వేరే వ్యక్తి గెలుస్తారో చూడాలి.

Similar News

News September 8, 2024

ప్రొద్దుటూరులో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. అండర్-18, 20, 23 మహిళలకు, పురుషులకు పరుగు పోటీలు, లాంగ్ జంప్, హైజంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు.

News September 8, 2024

కడప: ఈనెల 10న జాబ్ మేళా

image

కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, జమ్మలమడుగులోని న్యాక్ కేంద్రంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 8, 2024

కడప: మహిళకు అరుదైన శస్త్రచికిత్స

image

కడపలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నీలకంఠరావు పేటకి చెందిన మహిళ గత నాలుగు నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యుల్ని సంప్రదించగా పరీక్ష చేసి కడుపులో సుమారు ఫుట్ బాల్ సైజులో రెండు కిలోల పైగా ఉన్న కణితిని గుర్తించారు. ఈ కణితిని కడపలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.