News November 8, 2024
అవినీతిలో ఉమ్మడి పాలమూరు జిల్లా టాప్!
రాష్ట్రంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవినీతిలో అగ్రస్థానంలో ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అవినీతి కేసులు నమోదవుతున్నాయి. రెవెన్యూ, విద్యుత్, పోలీసు పలు శాఖలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో రెడ్ హ్యాండెడ్గా 14 మందిని పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిని ఏసీబీ అధికారులు జైలుకు పంపిస్తున్నా.. ప్రభుత్వ అధికారులలో తీరు మారడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News November 8, 2024
రేవంత్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగి.. సీఎం దాకా !
8 నవంబర్ 1969లో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా ఎగిది నేడు సీఎం అయ్యారు. 2006లో ZPTCగా, 2007 MLCగా, 2019లో మల్కాగిజిరి ఎంపీగా, 2009, 2014, 2023 నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 7 జూలై 2021–6 సెప్టెంబర్ 2024 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 7 డిసెంబర్ 2023న తెలంగాణ 2వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.
News November 8, 2024
10న కురుమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాక
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 10న (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జాతర పరిసరాలను జిల్లా ఎస్పీ జానకి, వివిధ శాఖల అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు.
News November 8, 2024
MBNR: ఉపాధ్యాయురాలు స్కెచ్.. ఏసీబీకి చిక్కిన DEO
మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ డీఈఓ రవీందర్ ఏసీబీకి చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పదోన్నతుల్లో ఓ ఉపాధ్యాయురాలుకు దక్కాల్సిన ప్రమోషన్ మరొక ఉపాధ్యాయురాలకు దక్కడంతో ఆమె ఎన్నోసార్లు డీఈఓ రవీందర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. కోర్టుకు వెళ్లినప్పటికీ లంచం డిమాండ్ చేయడంతో ACBకి ఆశ్రయించారు. ఈ క్రమంలో DEOను హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.