News November 22, 2024
అవినీతిలో జగన్ గ్లోబల్ స్టార్: సోమిరెడ్డి

YCP అధినేత జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అవినీతికి పాల్పడటంలో ఆయన ఓ గ్లోబల్ స్టార్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు CBI స్థాయి విచారణకే పరిమితం అయిన జగన్.. ఇప్పుడు అమెరికా FBI స్థాయికి ఎదిగారన్నారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానంటూ ‘X’లో పోస్ట్ చేశారు.
Similar News
News November 18, 2025
తోటపల్లి: ఇంటిని లాక్కొని బెదిరిస్తున్నారని ఫిర్యాదు.!

నల్లూరు జిల్లా తోటపల్లి గూడూరుకి చెందిన తన ఇంటిని లాక్కొని అల్లుడు బెదిరిస్తున్నారని వృద్ధుడు సోమవారం పోలీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. తన పెద్ద అల్లుడు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళంవేసి, ఇంటి నుంచి తరిమేసి చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. తనకు మగ పిల్లలులేరని, ఇద్దరు ఆడపిల్లలని, భార్య చనిపోయారని, విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.

News November 17, 2025
నెల్లూరు: సదరం.. నాట్ ఓపెన్..!

వికలాంగత్వ ధ్రువీకరణ కోసం తీసుకొచ్చిన “సదరం” సైట్ ఓపెన్ కావడం లేదు. ఈనెల 14 న సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. రెండు రోజులకే మూతపడింది. అదేమిటంటే ఒకసారి స్లాట్స్ అయిపోయాయని చెప్పుకొచ్చారు. వెయిటింగ్ లిస్ట్ కింద అయినా దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నం చేయగా.. సైట్ క్లోజ్ అయిపొయింది. ఇదేమి విచిత్రమని ప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి ఇవే తిప్పలు ఎదురవుతున్నాయి.