News November 22, 2024
అవినీతిలో జగన్ గ్లోబల్ స్టార్: సోమిరెడ్డి
YCP అధినేత జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అవినీతికి పాల్పడటంలో ఆయన ఓ గ్లోబల్ స్టార్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు CBI స్థాయి విచారణకే పరిమితం అయిన జగన్.. ఇప్పుడు అమెరికా FBI స్థాయికి ఎదిగారన్నారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానంటూ ‘X’లో పోస్ట్ చేశారు.
Similar News
News December 11, 2024
పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానన్న వ్యక్తిది నెల్లూరే..!
పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానని <<14834003>>హత్యా బెదిరింపులకు<<>> పాల్పడిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. మల్లికార్జున రావు మద్యం మత్తులో విజయవాడ నుంచి బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.
News December 11, 2024
వ్యభిచారం కేసులో నెల్లూరు వాసుల అరెస్ట్
తిరుపతి బస్టాండ్ సమీపంలో వ్యభిచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు(D) పొదలకూరు(M) డేగపూడికి చెందిన గోవర్ధన్ రెడ్డి, అనంతమడుగు వాసి మద్దాలి వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తికి చెందిన గుడాల గురవయ్య జయశ్యాం థియేటర్ వీధిలోని లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ ఓ మహిళను ఉంచి వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
News December 11, 2024
రాజముద్రలతో నూతన పాస్ పుస్తకాలు: మంత్రి ఆనం
జగన్ బొమ్మలు తొలగించి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలతో రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని పొంగూరు, నాగులపాడు రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..పాస్ పుస్తకలపై జగన్ ఫోటోను తొలగించి రాజముద్రలతో ముద్రితమవుతాయని, భూ సమస్యలను పరిష్కరించి, రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని తెలిపారు.