News January 30, 2025
అవి పట్టా భూములే: MP మిథున్ రెడ్డి

పట్టా భూములను అటవీ భూములుగా దుష్ప్రచారం చేయడం తగదని MPపెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. CM చంద్రబాబు కక్ష సాధింపుతోనే అనుకూల పత్రికలలో తమపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. వాటిని నిరూపించలేక పోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని, ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. తమకూ మంచి రోజులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News November 10, 2025
చీపుర పుల్లల కోసం వెళ్లి.. మృతి

బల్లికురవ మండలం సురేపల్లిలోని కొండ మీదకు రామాంజనేయులు(65) ఆదివారం చీపుర పుల్లల కోసం వెళ్లి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన గొర్రెల కాపరులు, స్థానికులు 108కు సమాచారం అందించారు. కొండ మీద నుంచి అతనిని కిందకు తీసుకొస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News November 10, 2025
మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచిన ప్రభుత్వం

AP: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, యూజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. 2020-23 బ్లాక్ పీరియడ్లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15% పెంపునకు ఆమోదం తెలిపింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తుదితీర్పులకు లోబడి ఇది ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు రూ.17.25 లక్షలుగా ఫీజును నిర్ధారించింది.
News November 10, 2025
ఉమ్మడి నిజామాబాద్ ప్రజలకు అలర్ట్

రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిడ్కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు పొగమంచు ప్రభావం ఉంటుందని, వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


