News May 19, 2024
అవి పులి పాదముద్రలు కావు: ఫారెస్ట్ అధికారులు
భోగాపురం మండలంలో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై అటవీశాఖ అధికారులు స్పందించారు. దిబ్బలపాలెం ప్రాంతంలో సెక్షన్ అధికారి మధుమోహన్‌రావు శనివారం పర్యటించి పాదముద్రలు పరిశీలించారు. అవి పులి అడుగుజాడల్లానే ఉన్నా.. దుమ్మలగుండుగా పిలిచే హెన్నావిగా నిర్ధారించారు. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
Similar News
News December 4, 2024
ఊపిరి పీల్చుకున్న విజయనగరం..!
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విశాఖలో అక్కయ్యపాలెంతోపాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. కాగా.. గత సెప్టెంబర్‌లో బొబ్బిలి, పాచిపెంట, మక్కువ, సాలూరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించగా..రిక్టర్ స్కేలు 3.4గా నమోదైంది.
News December 4, 2024
బొబ్బిలిలో రైలు ఢీకొని యువకుడి మృతి
బొబ్బిలి పట్టణంలో రైలు ఢీకొని ఓ యువకుడు మంగళవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన యువకుడు బాడంగి మండలం భీమవరం గ్రామానికి చెందిన కొండేటి చంద్రశేఖర్‌గా గుర్తించారు. అయితే ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే ఎస్ఐ బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 3, 2024
పూసపాటిరేగ: డమ్మీ సర్పంచ్‌పై సర్పంచ్ ఫిర్యాదు
తానే గ్రామానికి సర్పంచ్‌ను అంటూ అధికారులను, ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్నాడని టీడీపీ నాయకుడు దల్లి ముత్యాలరెడ్డిపై కుమిలి సర్పంచ్ మామిడి అప్పయ్యమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎంపీడీవో రాధికకు ఆమె వినతిపత్రం సమర్పించారు. సర్పంచ్ అంటూ చెప్పుకుంటూ తిరగడమే కాకుండా లెటర్ ప్యాడ్‌పై కూడా సర్పంచ్ గానే ముద్రించి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.