News December 24, 2024

అశోక్‌ నగర్‌లో గ్రూప్-2 అభ్యర్థి సురేఖ ఆత్మహత్య

image

HYD అశోక్ నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న గుగులోతు సురేఖ(22) ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి(D) గాంధారి(M) సోమారం తండాకు చెందిన సురేఖకు NZBకు చెందిన అబ్బాయితో గత నెలలో ఎంగేజ్మెంట్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి కూడా నిశ్చయమైంది. కాగా కుటుంబ సమస్యలతో నిన్న సూసైడ్ చేసుకుంది.

Similar News

News October 22, 2025

కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత

image

కొమురం భీం నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

News October 22, 2025

NZB: అన్నదాతలను కాంగ్రెస్ అరిగోస పెడుతోంది: కవిత

image

కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలను అరిగోస పెడోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకన్నా రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ట్వీట్ చేశారు.

News October 22, 2025

NZB: ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేకు విశేష స్పందన

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్-2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.