News February 4, 2025

అశ్వారావుపేట: ఎంపీటీసీ స్థానాల మార్పులకు కలెక్టర్ ఆమోదం

image

అశ్వారావుపేట పట్టణం మున్సిపాలిటీగా మారిన క్రమంలో ఎంపీటీసీ స్థానాల మార్పు అనివార్యమైంది. గతంలో మండల పరిధిలో 17ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11స్థానాలకు కుదిస్తూ రూపొందించిన ఫైల్‌పై జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్టు అధికారులు ప్రకటించారు. అందుకు సంభందించి వివరాలను స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసు బోర్డుపై ఉంచినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటన ద్వారా  తెలిపారు.

Similar News

News February 18, 2025

జగిత్యాల: ఆదర్శ పాఠశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం

image

జగిత్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫిబ్రవరి 28లోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు www.telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News February 18, 2025

కనకగిరి ఫారెస్ట్‌‌లో నిపుణుల పర్యటన

image

కనకగిరి ఫారెస్ట్‌‌లో వన్యప్రాణి నిపుణులు 12గంటల పాటు కాలినడకన పర్యటించారు. 12 మంది నిపుణులు 4 కి.మీ.ల అడవిని పరిశీలించి వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఫారెస్ట్‌ ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని పేర్కొన్నారు.

News February 18, 2025

నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.

error: Content is protected !!