News March 14, 2025
అశ్వారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం

అశ్వారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిరుమలకుంట గ్రామ శివారు ఆంజనేయస్వామి గుడి దగ్గర రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 23, 2025
అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తాం: మంత్రి సీతక్క

నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని మంత్రి సీతక్క అన్నారు. కొత్తగూడలో వివిధ కార్యక్రమాలకు వెళ్తున్న మంత్రి మార్గమధ్యలోని ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఆగారు. స్థానిక నాయకులతో మంత్రి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. వరంగల్ డీసీసీ అధికార ప్రతినిధి రవీందర్ రావు, తదితరులున్నారు.
News April 23, 2025
ఈ నెల 25న గురుకుల ప్రవేశ పరీక్ష: కలెక్టర్ మహేశ్

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10-12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలు మే 14న విడుదల చేస్తారన్నారు. ఏప్రిల్ 25 మధ్యాహ్నం 2.30-5 గంటల వరకు జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందన్నారు.
News April 23, 2025
NGKL: ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి: సీపీఎం

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడికి వ్యతిరేకంగా బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.