News April 7, 2025
అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

అశ్వారావుపేట శివారులో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. అశ్వారావుపేటకు చెందిన జీసీసీ రేషన్ డీలర్ భూక్యా కృష్ణ మండలం కావడిగుండ్లలో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో దొంతికుంట సమీపంలో వాగొడ్డుగూడెం వైపు వెళ్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో డీలర్ కృష్ణకు కుడికాలు విరగ్గా వాగొడ్డుగూడెంకు చెందిన నాగరాజు, గంగారంకి చెందిన రాజుకు గాయాలయ్యాయి.
Similar News
News January 11, 2026
WGL: ఓసీ సంఘాల డిమాండ్స్ ఇవే

1. ఓసీల రక్షణకు జాతీయ స్థాయిలో <<18829162>>ఓసీ కమిషన్<<>> ఏర్పాటు చేసి, రాష్ట్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాలి
2. విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఓసీలపై జరుగుతున్న వివక్షతను పూర్తిగా తొలగించాలి
3. ఈడబ్ల్యూఎస్ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేసి, ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలి
4. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కు షరతులు లేని ఐదేళ్ల గడువు కల్పించాలి.
5. ఓసీలకు ఉద్యోగ వయోపరిమితి సడలింపు చేయాలి
News January 11, 2026
తెలంగాణలో ప్రమాదం.. కడప జిల్లా దంపతులు మృతి

కడప జిల్లాకు చెందిన శేషయ్య (72), నవనీతమ్మ (64) దంపతులు తెలంగాణలోని భూత్పూర్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. SI చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమారుడిని కలిసి కారులో తిరుపతి వెళ్తుండగా, వెనుక నుంచి మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సీటుబెల్టు పెట్టుకోకపోవడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు.
News January 11, 2026
పండుగల్లో డైట్ జాగ్రత్త

పండుగ రోజుల్లో సాధారణంగా చాలా త్వరగా లేచి హడావిడిగా పనులు చేస్తుంటారు. టిఫిన్ చేసే టైం లేక కనిపించిన పిండి వంటలనే నోట్లో వేసుకుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకొని తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఈ సమయంలో కాఫీలు, కూల్ డ్రింకులు కాకుండా కొన్ని పండ్లు, పండ్ల రసాలు అందుబాటులో పెట్టుకోండి. దీంతో జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు త్వరగా భోజనం చెయ్యాలి.


