News July 12, 2024
అశ్వారావుపేట CI, నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సీఐ జితేందర్ రెడ్డితో పాటు, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా SP రోహిత్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ, కానిస్టేబుళ్లు వేధింపులు గురి చేస్తున్నారంటూ, గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ మరణించిన విషయం తెలిసిందే. అటు సీఐ, కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 8, 2025
భద్రాద్రి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

ములకలపల్లి మండలం సుబ్బనపల్లి, బండివారి గుంపులో కరెంట్ షాక్‌తో బండి వెంకటమ్మ(57) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. వెంకటమ్మ తన నివాసంలో ఉండగా, మంచం మీద కరెంట్ వైర్ పడటంతో ఈ విషాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఇంటి నుంచి కాలిన వాసన రావడంతో సమీప ప్రజలు వెళ్లి చూడగా, అప్పటికే మృతి చెందారని తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 8, 2025
క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి:DIEO

ఇంటర్‌లో MPHW (ఫీమేల్) కోర్సు ఉత్తీర్ణులైన వారు ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని DIEO రవిబాబు సూచించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇచ్చే శిక్షణకు ఎంపికైన వారు రూ.వెయ్యి డీడీ అందజేయాల్సి ఉంటుందని, గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటాతో దరఖాస్తులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 15లోగా అందజేయాలన్నారు.
News February 8, 2025
ఖమ్మం: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

ఖమ్మం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన మూడు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు వరుసకు సోదరులు. ఇటీవల కన్నుమూసిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా బూడిదంపాడు వద్ద ప్రమాదం జరిగింది. ఇంకో ఘటన బోనకల్‌లో శుభకార్యానికి వెళ్లొస్తుండగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ఆస్పత్రికి వచ్చివెళ్తున్న రైతు కన్నుమూశాడు.