News May 25, 2024
అశ్వ వాహనంపై పెంచల కోన నరసింహుడి విహారం

పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని శుక్రవారం రాత్రి అశ్వ వాహనంపై ఊరేగించారు. ప్రత్యేక వాయిద్యాలు, భక్త జన కోలాహలం నడుమ ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. చివరిగా ఇవాళ రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గోనుపల్లి గ్రామంలో ఊరేగించనున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.
Similar News
News December 17, 2025
గోవా నుంచి తిరుపతికి.. అక్కడ నుంచి నెల్లూరుకి..

నెల్లూరు కార్పొరేషన్కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్లో సమావేశం ఉంటుంది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.
News December 17, 2025
లింగసముద్రం: గుండెపోటుతో హోంగార్డు మృతి

లింగసముద్రం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొండలరావు గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి బైక్పై విధి నిర్వహణకు పోలీస్ స్టేషన్కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
News December 17, 2025
బుచ్చిలో మహిళ ఆత్మహత్యాయత్నం

చీరతో ఫ్యాన్కు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుచ్చిలోని చెన్నూర్ రోడ్డులో మంగళవారం జరిగింది. మహందాపురానికి చెందిన శ్రీను నెల్లూరుకు చెందిన భార్గవిని 2ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప ఉంది. ప్రస్తుతం ఆ మహిళ రెండు నెలల గర్భవతి. భర్తని హోటల్లో భోజనం తెమ్మని, భర్త వచ్చేలోపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త గమనించి రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించాడు.


