News February 19, 2025
‘అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలి’

అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయి అమలు కమిటీతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న 2 లక్షల మంది అసంఘటిత కార్మికులను ఈ -శ్రమ్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News November 16, 2025
లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.
News November 16, 2025
పెరుగుతో అందం పెంచేయండి..

చర్మ సమస్యలను తగ్గించడానికి పెరుగు పరిష్కారం చూపుతుంది. * అరటిపండు, తెల్లసొన, శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. దీనివల్ల మోము మృదువుగా మారుతుంది. * పెరుగు, మెంతి పొడి, బాదం నూనె, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఓట్స్ చర్మానికి క్లెన్సర్‌లా పనిచేసి మృత కణాలు, మురికినీ తొలగిస్తాయి.
News November 16, 2025
మల్లెమడుగు రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

తిరుపతి తాతయ్యగుంటకు చెందిన శేఖర్ (32), శివ (35), నరేష్ (36) ముగ్గురు రేణిగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్‌కు ఈతకోసం వెళ్లారు. ఉదయం 9 గంటలకు నీటిలో దిగిన శివ లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతుండగా, కాపాడేందుకు దూసుకెళ్లిన నరేష్ కూడా మునిగిపోయాడు. శేఖర్ రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో కలిసి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.


