News February 5, 2025

అసంఘటిత కార్మికుల నమోదుకు స్పెషల్ డ్రైవ్ – కలెక్టర్

image

అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ నందు ఉచిత నమోదుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్క కార్మికుడిని పోర్టల్‌లో నమోదు చేయించాలని సూచించారు.

Similar News

News February 9, 2026

ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకం: కలెక్టర్

image

ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ఈ వారోత్సవాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ‘KYC – సురక్షిత బ్యాంకింగ్ దిశగా తొలి అడుగు’ అనే అంశంపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో అక్షరాస్యత కీలకమని పేర్కొన్నారు.

News February 9, 2026

నేరాల కట్టడికి ఎస్పీ కొత్త అస్త్రం.. జిల్లాలో “పల్లెనిద్ర” షురూ!

image

జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రకటించారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేస్తూ, క్షేత్రస్థాయిలో భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువస్తే, వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

News February 8, 2026

రేపు ‘డయల్‌ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి ఎస్‌ఈ కె.తిలక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9 నుంచి ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు.