News February 21, 2025
అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు: మన్యం SP

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలు చేపడతామన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రత్యేక టీం ద్వారా నిరంతరం నిఘా ఉందని చెప్పారు. యువత సోషల్ మీడియాను వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం: KUలో త్వరలోనే ఫేస్ రికగ్నిషన్ హాజరు..!

కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్, నాన్టీచింగ్(రెగ్యులర్, కాంట్రాక్టు, టైంస్కేల్, ఔట్సోర్సింగ్) ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం అమలు చేయడానికి కేయూ సిద్ధమైంది. ఈనెల 6, 8వ తేదీల్లో ఉద్యోగులు తమ విభాగాల్లో అందుబాటులో ఉండాలని, ఫొటో క్యాప్చర్ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిపాలన భవనానికి హాజరవాల్సిందిగా రిజిస్ట్రార్ రామచంద్రం వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచించినట్లు సమాచారం.
News December 5, 2025
చిలకలూరిపేట ఘటనపై అధికారులను ఆరా తీసిన మంత్రి లోకేశ్

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందడంపై మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్ పేర్కొన్నారు.
News December 5, 2025
WGL: కబ్జారాయుళ్లపై నిఘా.. 150 మంది పేర్లతో జాబితా!

ట్రై సిటీలో కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల జాబితాను WGL పోలీసులు తయారు చేసినట్లు తెలిసింది. 360 మంది పేర్లతో కూడిన జాబితాను నిశితంగా పరిశీలించి, వాటి నుంచి 150 పేర్లతో కూడిన ఫైనల్ జాబితాను తయారు చేసి, వారిపై నిఘా పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధాన నేతలకు సంబంధించిన కొందరు అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ జాబితాను రూపొందించారట.


