News November 19, 2024

అసహనం వ్యక్తం చేసిన చిత్తూరు కలెక్టర్

image

జిల్లాలో గోకులం షెడ్ నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పశుసంవర్ధక శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించకపోగా, పలు చోట్ల షెడ్ల నిర్మాణం పూర్తి అయిన బిల్లులు ఎందుకు అప్లోడ్ చేయలేదని నిలదీశారు. నిధుల కొరత లేదని, రైతులకు అవగాహన కల్పించి గోకులం షెడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

Similar News

News December 2, 2024

చిత్తూరు: 120 స్మార్ట్ అలారం లాక్ పంపిణీ

image

టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ నెట్టికంటయ్య నగరంలోని పలు ప్రార్ధనా మందిరాలకు 120 స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నియంత్రణకు టూ టౌన్ పరిధిలోని అన్ని చర్చిలు, దేవాలయాలు, మసీదులకు స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేస్తున్నామన్నారు. దుకాణా దారులు, ఇంటి యజమానులు సైతం ఈ లాక్ లను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News December 2, 2024

తిరుపతి: అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

image

తుఫాను ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా ఉన్నట్టు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. వాగులు, వంకల వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్లపై నేలవాలిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించేలా సిబ్బంది చర్యలు చేపట్టారన్నారు. అత్యవసర సమయాలలో 112/80999 99977కు సమాచారం ఇవ్వాలన్నారు.

News December 2, 2024

పెద్దమండెం: రైతుపై హత్యాయత్నం

image

రైతుపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆదివారం పెద్దమడెం మండలంలో చోటుచేసుకుంది. SI రమణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండమీదపల్లికి చెందిన లక్ష్మీనారాయణ(55) పొలంలో వేరే పొలానికి చెందిన వెంకటరమణ పాడి పశువులు పంట నష్టం చేశాయని ఇటీవల మందలించాడు. దీంతో కసి పెంచుకొన్న వెంకటరమణ తన అనుచరులతో దారికాసి కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి, హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.