News April 2, 2025

అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి: ADB SP

image

డయల్ 100 సిబ్బంది వీలైనంత త్వరగా ఘటన స్థలాలకు చేరుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ అన్నారు. తమ పరిధిలో పెట్రోలింగ్, గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలన్నారు. బ్లూ కోర్ట్&డయల్ 100 సిబ్బంది, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. అదేవిధంగా పాత నేరస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. డయల్ 100కి ఫోన్ చేసే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నారు.

Similar News

News April 25, 2025

ADB: కట్టుకున్నవారే కడతేర్చుతున్నారు

image

కట్టుకున్నవారే కాలయముళ్లుగా మారి కడతేరుస్తున్నారు. బంధాలను మర్చిపోయి పిల్లలను తల్లి ప్రేమకు దూరం చేస్తున్నారు. ADB (D) గుడిహత్నూర్‌కు చెందిన మారుతి భార్యపై కక్ష పెంచుకుని కత్తితో హతమార్చాడు. ASF(D) కాగజ్‌నగర్‌కు చెందిన జయరాం మగసంతానం కోసం భార్యతో గొడవపడి పలుగుతో దాడి చేసి చంపాడు. అన్యోన్యంగా ఉండాల్సినవారు గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.

News April 25, 2025

నిర్మల్: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి

image

నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలో దారుణం జరిగింది. మల్లాపూర్ గ్రామంలో కన్నకొడుకు గొడ్డలితో నరికి తండ్రి హత్య చేశాడు. గ్రామానికి చెందిన బైనం అశోక్ (29)ను అతని తండ్రి బైనం ఎర్రన్న ఇవాళ ఉదయం హత్య చేశాడని గ్రామస్థులు పేర్కొన్నారు. చంపిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెల్లి లొంగిపోయాడు. ఎస్ఐ రహమాన్ మాలిక్ ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2025

ADB: వడదెబ్బకు ఏడుగురి మృతి

image

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.

error: Content is protected !!