News May 20, 2024
అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం: నెల్లూరు ఎస్పీ

జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపనున్నట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఆదివారం నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని నవాబ్ పేట, కావలి 1 టౌన్, కావలి 2 టౌన్, కావలి రూరల్, ఉదయగిరి, వింజమూరు పరిధిలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Similar News
News December 24, 2025
99.21 % పల్స్ పోలియో వ్యాక్సిన్ నమోదు: DMHO

జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 99.21% మంది చిన్నారులకు చుక్కల మందు ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారిని సుజాత తెలిపారు. ఆది, సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 0-5 సం.లలోపు చిన్నారులకు తొలిరోజు 2,83,173, 2వ రోజు 4,461, 3వ రోజు 4,628 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.
News December 24, 2025
నెల్లూరు: మరింత వేగంగా విజయవాడకు.!

విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్కు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారిలో 280కి.మీ మేర మూడో ట్రాక్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. సరకు రవాణాతోపాటు హై స్పీడ్ రైళ్ల రాకపోకల కోసం కేంద్రం నాలుగో లైన్ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తోన్నట్లు సమాచారం. ఇది పూర్తి అయితే VJD-GDR మధ్య రవాణా సమయం మరింత తగ్గనుంది. కావలి, కోవూరు, నెల్లూరు, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల మీదుగా ఈ నిర్మాణం జరగనుంది.
News December 24, 2025
తిరుపతిలో స్కాం.. AEO సూసైడ్పై చర్చ

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో <<18647016>>స్కాం <<>>జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నాటి AEOపై క్రమశిక్షణా రాహిత్యం కేసు ఎందుకు నమోదైంది? రిటైరయ్యే కొన్ని రోజుల ముందే ఆయన సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఆ కేసు ఎందుకు క్లియర్ కాలేదనేది నేటికి ప్రశ్నగా మిగిలింది.


