News March 1, 2025
అసిఫాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: DIEO కళ్యాణి

ఈనెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభించనున్నట్లు DIEO సిహెచ్ కళ్యాణి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10,054 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఫస్ట్ ఇయర్ 4758 మంది, సెకండ్ ఇయర్ 5396 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమల్లో ఉంటుంది.
Similar News
News March 24, 2025
MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్‌తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 24, 2025
విశాఖలో IPL మ్యాచ్.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మ.2 నుంచి రాత్రి 12 గంటల వరకు మధురవాడ స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా దారి మళ్లించారు.
News March 24, 2025
వైజాగ్‌లో IPL మ్యాచ్.. భారీ వాహనాలకు నో ఎంట్రీ