News March 28, 2025

అసిఫాబాద్: కానిస్టేబుల్‌ను అభినందించిన ఎస్పీ

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో వరుస దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాగజ్ నగర్ పట్టణంలో ఇద్దరు దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన ఐడి పాలిటి కానిస్టేబుల్ రాజును జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు పోలీస్ శాఖ తరపున ప్రశంస పత్రాన్ని అందించారు. వీరితో కాగాజ్‌నగర్ డిఎస్పీ రామానుజన్ ఉన్నారు.

Similar News

News November 10, 2025

కేడీసీలో ఘనంగా అంతర్జాతీయ అకౌంట్స్ దినోత్సవం

image

హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (KDC) లో అంతర్జాతీయ అకౌంట్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.గుర్రపు శ్రీనివాస మాట్లాడుతూ.. జంట పద్దు విధానాన్ని లూకాపాసియోలి రూపొందించి ఈ రోజున మొదటిసారిగా ప్రచురించారన్నారు. అందువల్లనే ఈరోజున అంతర్జాతీయ అకౌంటింగ్ దినోత్సవంగా జరుపుకొంటారని పేర్కొన్నారు.

News November 10, 2025

భూముల్లో సూక్ష్మపోషక లోపాలు ఎందుకు వస్తాయి?

image

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.

News November 10, 2025

ఇల్లెందులో విషాదం.. 3 నెలల గర్భిణీ మృతి

image

ఇల్లెందు మండలం లచ్చగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం వివాహమైన అంజలి (20) అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మూడు నెలల గర్భిణీ అయిన అంజలి, ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కుమార్తె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.